ప్లాస్టిక్ తినే ఫంగస్!
కలపకు గట్టిదనం ఎక్కుడి నుంచి వస్తుందో తెలుసా? బలమైన సేంద్రియ పాలిమర్ పదార్థం లిగ్నిన్ నుంచే. వైట్-రాట్ ఫంగస్ కొన్ని ఎంజైమ్‌ల సాయంతో దీన్ని కూడా విచ్ఛిన్నం చేసేస్తుంది.
వ్యర్థ ప్లాస్టిక్ ప్రపంచాన్ని భూతంలా పట్టి పీడిస్తోంది. దీన్ని వదిలించు కోవటానికి శాస్త్రవేత్తలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అడవిలో చెట్లకు, రాలిపోయిన కొమ్మలకు అంటుకొనే వైట్-రాట్ ఫంగస్ ఈ విషయంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా ఇది కలపలోని కార్బన్‌ను జీర్ణం చేసుకొని వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. అయితే తగినంత ‘తిండి’ దొరకనప్పుడు ఇది కలపకు బదులు ప్లాస్టిక్‌ను భోంచేయటం విశేషం.
కలపకు గట్టిదనం ఎక్కుడి నుంచి వస్తుందో తెలుసా? బలమైన సేంద్రియ పాలిమర్ పదార్థం లిగ్నిన్ నుంచే. వైట్-రాట్ ఫంగస్ కొన్ని ఎంజైమ్‌ల సాయంతో దీన్ని కూడా విచ్ఛిన్నం చేసేస్తుంది. అంత త్వరగా క్షీణించని ఇంత గట్టి కలపనూ ఇది జీర్ణం చేసుకోగలదంటే పాలీఎథిలీన్ (ప్లాస్టిక్) వంటి ఇతర పదార్థాలనూ అరిగించుకోలదు కదా. ఇదే శ్రీలంకలోని కెలనియా యూనివర్సిటీ పరిశోధకులను ఆలోచింపజేసింది. వెంటనే రంగంలోకి దిగారు. మధ్య శ్రీలంకలోని డింబుల్‌గల అడవిలోంచి కలపను క్షీణింపజేసే 50 రకాల ఫంగస్‌ను సేకరించారు. వీటిని రెండుగా విభజించి కొన్నింటికి తక్కువ సాంద్రతతో కూడిన ప్లాస్టిక్‌ను.. మరికొన్నింటికి ప్లాస్టిక్, కలప రెండింటినీ ఆహారంగా వేశారు. ఇవి కలప కన్నా ప్లాస్టిక్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు, ముఖ్యంగా ప్లాస్టిక్‌ను బాగా విడగొడుతున్నట్టు గుర్తించారు. జీవక్రియ పరంగా ఈ ప్రాణులు మారే గుణాన్ని కలిగుంటున్నట్టు అనిపిస్తోందని, ఇది పరిణామక్రమం గొప్పతనం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఏది అందుబాటులో ఉంటే దాన్నే ఫంగస్ వినియోగించుకొని మనగలుగుతోందని వివరిస్తున్నారు. వైట్-రాట్ ఫంగస్ కొన్ని ఆక్సిడైజింగ్ ఎంజైమ్‌ల సాయంతో కలప, ప్లాస్టిక్ రెండింటినీ విడగొడుతుండటం గమనార్హం. లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ కీవ్ ప్రకారం.. ఇప్పటివరకూ ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే 430 జాతుల ఫంగస్, బ్యాక్టీరియాను గుర్తించారు. ఇవి విడుదల చేసే ఎంజైమ్‌లను గుర్తించి, వాడుకోగలిగితే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించుకోవటానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం