ఛార్జింగ్‌ పక్కాగా..

ఫోన్‌లో బ్యాటరీ కీలకమైన భాగమే అయినా చాలామంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు. ఛార్జింగ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువకాలం మన్నేలా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవచ్చు.

Updated : 15 Feb 2023 06:13 IST

ఫోన్‌లో బ్యాటరీ కీలకమైన భాగమే అయినా చాలామంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు. ఛార్జింగ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువకాలం మన్నేలా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవచ్చు. ఛార్జింగ్‌ వేగాన్ని పెంచుకోవటంతో పాటు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

ఫోన్‌కు కవర్‌ వేస్తాం. లేదూ కేసులో పెడతాం. ఫోన్‌ భద్రంగా ఉండటానికివి తోడ్పడతాయనటంలో సందేహం లేదు. కానీ ఫోన్‌ను వీటిల్లోనే ఉంచి ఛార్జింగ్‌ చేయటం మాత్రం తగదు. చాలామంది చేసే పొరపాటు ఇదే. కవర్‌లోనో, కేసులోనో ఫోన్‌ ఉండగా ఛార్జింగ్‌ చేస్తే బ్యాటరీలో వేడి పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కితే ఛార్జింగ్‌ వేగం తగ్గుతుంది. బ్యాటరీ జీవనకాలమూ పడిపోతుంది. కాబట్టి  ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసేటప్పుడు కవర్‌/కేసు తొలగించటం మంచిది.

* ఇప్పుడు కొన్ని ఫోన్లకు చాలా వేగంగా ఛార్జ్‌ చేసే ఛార్జర్లు వస్తున్నాయి. అయితే వీటిని అన్నివేళలా వాడటం తగదు. 40 వాట్స్‌ అంతకన్నా ఎక్కువ వేగంతో ఛార్జ్‌ చేసే ఛార్జర్లు ఉన్నట్టయితే రోజూ వీటితో ఛార్జ్‌ చేయొద్దు. ఇవి బ్యాటరీ మీద ఎక్కువ భారం మోపి, త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి స్లో ఛార్జర్‌తో రాత్రిపూట ఛార్జ్‌ చేసుకోవటం మంచిది. అత్యవసరమైనప్పుడు, చాలా త్వరగా ఛార్జ్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడే ఫాస్ట్‌ ఛార్జర్‌ను వాడుకోవాలి.

* బ్యాటరీ ఛార్జింగ్‌ మరీ పడిపోక ముందే ఛార్జ్‌ చేసుకోవాలి. ఛార్జింగ్‌ 10-15 శాతమే ఉందనుకోండి. ఇలాంటి సమయంలో ఛార్జ్‌ చేస్తే బ్యాటరీ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎప్పుడో ఒకప్పుడంటే పెద్దగా తేడా ఉండదు గానీ రోజూ ఇలాగే చేస్తే బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి 15-20% కన్నా తక్కువకు పడిపోకముందే ఛార్జ్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని