Earth: భూమి భవిష్యత్తు ఇదేనా?
మన భూమి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సూర్యుడిలో శక్తి నిల్వలు తగ్గాక భూమి పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేనని భావిస్తున్నారు. కాలం చెల్లుతున్న నక్షత్రం తన గ్రహాన్ని మింగుతున్న తీరును శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు మరి.
మన భూమి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సూర్యుడిలో శక్తి నిల్వలు తగ్గాక భూమి పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేనని భావిస్తున్నారు. కాలం చెల్లుతున్న నక్షత్రం తన గ్రహాన్ని మింగుతున్న తీరును శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు మరి. ఈ గ్రహం సుమారు గురుడి సైజులో ఉంది. సూర్యుడి నుంచి బుధుడు ఉన్నంత దూరంలో తన నక్షత్రం చుట్టూ భ్రమిస్తోంది. కేంద్రంలోని ఇంధనం నిండుకున్న తర్వాత నక్షత్రం పెద్దగా అవటం ప్రారంభించిందని, తన పక్కనున్న గ్రహం మధ్య దూరం తగ్గుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎర్రటి భారీ నక్షత్రంగా మారి, చివరికి మొత్తం గ్రహాన్ని నక్షత్రం మింగేసిందని వివరిస్తున్నారు. ఎర్రటి భారీ నక్షత్రాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు ఊహించినప్పటికీ నేరుగా చూడటం ఇదే తొలిసారి. సుమారు 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడిలో ఇలాంటి పరిస్థితే ఏర్పడనుంది. సూర్యుడి సైజు 100 రెట్లు పెరగొచ్చు. ఎర్రటి భారీ నక్షత్రంగా మారొచ్చు. ఈ క్రమంలో బుధుడు, శుక్రడితో పాటు భూమినీ మింగేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana: రాష్ట్రంలో 53 మంది పోలీసు అధికారులకు పదోన్నతి
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
General News
Vskp-Sec Vande Bharat: ఈ నెల 10న నాలుగు గంటలు ఆలస్యంగా వందేభారత్
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
India News
Haridwar: ఆ ఆలయాలకు పొట్టి దుస్తులతో వస్తే కఠిన చర్యలు: మహానిర్వాణి అఖారా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు