రామగుండానికి ప్రధాని మోదీ!

ప్రధాని నరేంద్రమోదీ త్వరలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఒక రోజు రానున్నారని..

Updated : 06 May 2022 05:27 IST

25 లేదా 26న అధికారికంగా ఎరువుల కర్మాగారం ప్రారంభం

రామగుండం (ఫెర్టిలైజర్‌ సిటీ), న్యూస్‌టుడే : ప్రధాని నరేంద్రమోదీ త్వరలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఒక రోజు రానున్నారని.. అయితే 26న వచ్చే అవకాశాలెక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కర్మాగార నిర్మాణానికి 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని శంకుస్థాపన చేశారు. గత సెప్టెంబరు 9న మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి క్షణంలో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రధానమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం నుంచిమార్గదర్శకాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. యాజమాన్యం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపడుతోంది. వార్షిక మరమ్మతుల కోసం 10వ తేదీ నుంచి కర్మాగారాన్ని షట్‌డౌన్‌ చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రధాని కార్యక్రమం ఉన్నందున వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని