అధికార పార్టీని కాదని.. పక్కచూపులెందుకు?

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇటీవల ఓ ఎంపీటీసీ సభ్యుడితో సాగించిన ఫోన్‌ సంభాషణ సోమవార....

Published : 30 Nov 2021 06:42 IST

వైరల్‌ అయిన మంత్రి కొప్పుల సంభాషణ...

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇటీవల ఓ ఎంపీటీసీ సభ్యుడితో సాగించిన ఫోన్‌ సంభాషణ సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాదని, ఇతరులకు మద్దతు పలికేలా ఎంపీటీసీ సభ్యులను పోగేస్తున్నారనే సమాచారంతో మంత్రి... పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండే వెంకటేశ్వర్లును హెచ్చరించడం ఈ ఆడియో సారాంశం. ఈ సంభాషణలో స్థానిక సంస్థల జిల్లా స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవి కలిగిన మరోనేత పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి పరుష పదజాలాన్ని వాడినట్లుగా ఉంది. ఈ విషయాన్ని ‘ఈనాడు’ మంత్రి కొప్పుల దృష్టికి తీసుకెళ్లగా.. మాట్లాడింది వాస్తవమేనని తెలిపారు. ‘ఇది వారం రోజుల కిందట జరిగిన సంభాషణ. మా పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు పక్కదారి పడుతున్నారని తెలియడంతో మందలించా. అందులో నేనేమీ తప్పుగా మాట్లాడలేదు’ అని అన్నారు. తన చేతుల మీదుగా బీఫాం తీసుకుని గెలిచిన వ్యక్తిపై ఆ మాత్రం హక్కు ఉండదా! అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని