ఈ భవనం... రైతు కష్టాన్ని చాటుతుంది!

రైతే సమాజానికి స్ఫూర్తి ప్రదాత అంటారా సివిల్‌ ఇంజినీర్‌. ఆ అభిమానంతో తాను నిర్మించిన ఓ భవనాన్ని రైతు కష్టం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. కేపీహెచ్‌బీ ఎన్‌.ఆర్‌.ఎస్‌.ఎ. కాలనీకి చెందిన నున్నా వెంకటపోషి కోటేశ్వరరావు సివిల్‌ ఇంజినీర్‌గా ..

Published : 29 Nov 2021 04:45 IST

రైతే సమాజానికి స్ఫూర్తి ప్రదాత అంటారా సివిల్‌ ఇంజినీర్‌. ఆ అభిమానంతో తాను నిర్మించిన ఓ భవనాన్ని రైతు కష్టం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. కేపీహెచ్‌బీ ఎన్‌.ఆర్‌.ఎస్‌.ఎ. కాలనీకి చెందిన నున్నా వెంకటపోషి కోటేశ్వరరావు సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2013లో ఐడీఎల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థను స్థాపించి వాణిజ్య భవన సముదాయాలు, సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, ఐటీ పార్కులు నిర్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కోటేశ్వరరావుకు చిన్నప్పటి నుంచీ రైతులంటే ఎనలేని గౌరవం. తాను  నిర్మించబోయే గృహ సముదాయాలకు పెట్టేందుకు రైతు పేరు స్ఫురించేలా 18 రకాల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించారు. ప్రప్రథమంగా బాచుపల్లి-గండిమైసమ్మ రోడ్డులోని ప్రగతినగర్‌ కమాన్‌ ఎదురుగా ఉన్న సింహపురికాలనీలో నిర్మించిన అపార్టుమెంట్‌కు ‘రైతు బిడ్డ’గా నామకరణం చేశారు. తమిళనాడు, ఒంగోలు నుంచి  కళాకారులను రప్పించి భవనంపై అన్నదాత శ్రమను చాటేలా నగిషీలను తీర్చిదిద్దారు. ‘రైతును గౌరవించే వారికి మా స్వాగతం’అనే  అక్షరాలనూ చెక్కించారు.

-న్యూస్‌టుడే, నిజాంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని