కేటీఆర్‌ హామీ.. నిమిషాల్లో బదిలీ..

మంత్రి కేటీఆర్‌ చొరవతో ఓ సివిల్స్‌ ర్యాంకర్‌ తల్లికి ఉద్యోగ బదిలీ నిమిషాల్లో జరిగిపోయింది. అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకు సాధించి సివిల్స్‌కు ఎంపికైన డాక్టర్‌ శ్రీజ.. తన తండ్రితో కలిసి మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిభా పాటవాలతో విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచావని కేటీఆర్‌ ప్రశంసించారు. మీ తల్లిదండ్రులు ఏంచేస్తారని మంత్రి.. శ్రీజను ప్రశ్నించగా తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని,  తల్లి

Updated : 01 Dec 2021 04:42 IST

సివిల్స్‌ ర్యాంకర్‌ శ్రీజ తల్లికి వరంగల్‌ నుంచి నగరానికి ట్రాన్స్‌ఫర్‌

సివిల్స్‌ ర్యాంకర్‌ శ్రీజను అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: మంత్రి కేటీఆర్‌ చొరవతో ఓ సివిల్స్‌ ర్యాంకర్‌ తల్లికి ఉద్యోగ బదిలీ నిమిషాల్లో జరిగిపోయింది. అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకు సాధించి సివిల్స్‌కు ఎంపికైన డాక్టర్‌ శ్రీజ.. తన తండ్రితో కలిసి మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిభా పాటవాలతో విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచావని కేటీఆర్‌ ప్రశంసించారు. మీ తల్లిదండ్రులు ఏంచేస్తారని మంత్రి.. శ్రీజను ప్రశ్నించగా తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని,  తల్లి ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎంగా వరంగల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మీరుండేది హైదరాబాద్‌లో.. అమ్మ నిత్యం వరంగల్‌కు వెళ్లి పనిచేస్తున్నారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఆమె బదిలీకి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదని శ్రీజ వాపోయారు. ఆ విషయం తాను చూస్తానని మంత్రి పేర్కొన్నారు. శ్రీజ ఇంటికి వెళ్లేసరికి తల్లికి నగరానికి బదిలీ అయిందన్న సంతోషకర సమాచారం తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని