వంకాయ..పొడవులో సొరకాయ..!

సాధారణ పొడవుకు భిన్నంగా సొరకాయ మాదిరిగా ఆదిలాబాద్‌ రైతు బజార్‌లో ఓ వంకాయ కనిపించింది. యాపల్‌గూడకు చెందిన రాందాస్‌ అనే రైతు నాటిన వంగ మొక్కకు కాసిన వంకాయలు అడుగున్నర వరకు పెరిగాయి.

Published : 17 Jan 2022 04:16 IST

సాధారణ పొడవుకు భిన్నంగా సొరకాయ మాదిరిగా ఆదిలాబాద్‌ రైతు బజార్‌లో ఓ వంకాయ కనిపించింది. యాపల్‌గూడకు చెందిన రాందాస్‌ అనే రైతు నాటిన వంగ మొక్కకు కాసిన వంకాయలు అడుగున్నర వరకు పెరిగాయి. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. కొందరు రైతులు పాతకాలం విత్తనాలను బూడిదలో దాచిపెట్టి కొద్దికొద్దిగా వాడుతుంటారని, వాటిని సారవంతమైన నేలలో సేంద్రియపద్ధతిలో పండిస్తే ఏపుగా పెరుగుతుంటాయని చెప్పారు. వంకాయలు ఇలా అడుగున్నర పొడవు పెరగడం అరుదని అన్నారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని