Covaxin: టీన్స్‌కి ఇచ్చేందుకు కొవాగ్జిన్‌కే అనుమతి

దేశంలో అనేకచోట్ల 15- 18 ఏళ్ల పిల్లలకు ‘కొవాగ్జిన్‌’ టీకాకు బదులుగా ఇతర టీకాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఈ విషయంలో

Updated : 19 Jan 2022 08:48 IST

ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

భారత్‌ బయోటెక్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అనేకచోట్ల 15- 18 ఏళ్ల పిల్లలకు ‘కొవాగ్జిన్‌’ టీకాకు బదులుగా ఇతర టీకాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 15- 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు ఇచ్చేందుకు ‘కొవాగ్జిన్‌’ టీకా మాత్రమే అనుమతి పొందిన విషయాన్ని గుర్తించాలని సంస్థ పేర్కొంది అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను విశ్లేషించాకే ‘కొవాగ్జిన్‌’ టీకాను పిల్లలకు ఇవ్వడానికి అనుమతించారని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని