Hyd News: హైదరాబాద్‌ ఫొటో జర్నలిస్టుకు ఆమ్నెస్టీ అవార్డు

హైదరాబాద్‌కు చెందిన స్వతంత్ర ఫొటో జర్నలిస్టు వడ్లమాని హర్ష ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అవార్డు పొందారు. మే 4న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మానవ హక్కులకు సంబంధించి పరిశోధనలు, ప్రసార వార్తలు, డాక్యుమెంటరీలు,

Updated : 07 May 2022 08:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన స్వతంత్ర ఫొటో జర్నలిస్టు వడ్లమాని హర్ష ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అవార్డు పొందారు. మే 4న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మానవ హక్కులకు సంబంధించి పరిశోధనలు, ప్రసార వార్తలు, డాక్యుమెంటరీలు, ఫొటో జర్నలిజం, విద్యార్థి మీడియా, రేడియో తదితర విభాగాల్లో ఈ అవార్డులు అందించారు. దేశంలో కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తున్న సమయంలో ప్రజలపై చూపిన ప్రభావాన్ని కళ్లకు కట్టేలా ఆయన తీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఫొటో జర్నలిజం విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 40 రోజులు పర్యటించి అక్కడి దయనీయ పరిస్థితులను చిత్రీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు