Bathukamma: బతుకమ్మ.. బతుకమ్మ.. ఇయ్యాలో!

ఒక్కేసి పువ్వేసి సందమామా, ఒక్క జాము ఆయే సందమామా.. సిత్తూ సిత్తూల బొమ్మ, శివునీ ముద్దుల గుమ్మ... అంటూ ఆటాపాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఊరూవాడా లోగిళ్లన్నీ పుష్పవనాలుగా ఆవిష్కృతమవనున్నాయి.

Updated : 03 Jan 2024 15:43 IST

నేటి నుంచి పూలపండగ
ఘనంగా నిర్వహణకు ప్రభుత్వ ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్కేసి పువ్వేసి సందమామా, ఒక్క జాము ఆయే సందమామా.. సిత్తూ సిత్తూల బొమ్మ, శివునీ ముద్దుల గుమ్మ... అంటూ ఆటాపాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఊరూవాడా లోగిళ్లన్నీ పుష్పవనాలుగా ఆవిష్కృతమవనున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతోంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. గత ఏడాది కరోనాతో బతుకమ్మ వేడుకలపై కొంత ప్రభావం పడింది. ఈ ఏడాది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది.ప్రతి ఊరిలో మైదానాల వద్ద ఏర్పాట్లు చేయడంతోపాటు చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్‌లను నెలకొల్పి నిమజ్జనం సందర్భంగా అన్ని జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్లకు నిర్దేశించింది.

సీఎం శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. మహిళలు పండగను ఆనందోత్సాహాలతో,  కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని