INS Vagsheer: మరో స్వదేశీ జలాంతర్గామి

భారత నౌకాదళ జలాంతర్గాముల బలం మరింత పెరగనుంది. బుధవారం ఇక్కడి మజ్గావ్‌ డాక్‌ యార్డ్‌లో.. ప్రాజెక్టు-75లో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని ఏడాది

Updated : 21 Apr 2022 05:24 IST

ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జల ప్రవేశం

ముంబయి: భారత నౌకాదళ జలాంతర్గాముల బలం మరింత పెరగనుంది. బుధవారం ఇక్కడి మజ్గావ్‌ డాక్‌ యార్డ్‌లో.. ప్రాజెక్టు-75లో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని ఏడాది పాటు పరీక్షిస్తారు. తర్వాత నౌకాదళంలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్‌-75లో భాగంగా ఆరు స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాములను భారత్‌ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా.. ఇప్పటికే కల్వరి, కందేరి, వేల, కరంజ్‌ జలాంతర్గాములు నౌకదళంలో సేవలందిస్తున్నాయి. వాగ్‌షీర్‌ జలాంతర్గామికి సంబంధించి ప్రస్తుతం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఇది నౌకాదళంలోకి చేరే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌-75కు సాంకేతిక సాయాన్ని ఫ్రాన్స్‌ అందిస్తోంది. వాగ్‌షీర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ జలాంతర్గామి రాకతో భారత్‌ నౌకాదళం శక్తిమంతం కానుందని అన్నారు. ‘‘ఇవి కొత్త జలాంతర్గాములు. కొత్త సాంకేతికత, అధునాతన సెన్సర్లతో రూపొందాయి. ఇవి మన యుద్ధ సామర్ధ్యాన్ని మరింత పెంచనున్నాయి. ఐదో జలాంతర్గామి వాగ్‌షీర్‌ త్వరలోనే నౌకాదళ అమ్ములపొదిలో చేరుతుందని భావిస్తున్నాం’’ అని వైస్‌ అడ్మిరల్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు