కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.

Updated : 03 May 2024 06:31 IST

మే నుంచి జూన్‌ 9 వరకే సేవల పునరుద్ధరణ

ఈనాడు, అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. మినిమం టైం స్కేల్‌ ఇవ్వాలని, ఇతరత్రా డిమాండ్లతో గతంలో సమ్మె చేయడం, న్యాయస్థానాలను ఆశ్రయించడంతో వారిపై కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. గతంలో కేజీబీవీ ఉపాధ్యాయినులకు ఒక్క రోజు విరామంతో ఒప్పందాన్ని పునరుద్ధరించేవారు. ఏప్రిల్‌ 29న ఒప్పంద గడువు ముగియగా.. మే ఒకటి నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించేవారు. ఒక్క రోజు విరామంతో సర్వీసు కొనసాగించేవారు. ఈసారి కేవలం 40 రోజులకు మాత్రమే ఒప్పందం చేసుకున్నారు. మే ఒకటో తేదీ నుంచి జూన్‌ 9వరకు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. ఏడాదికి చేయాల్సిన ఒప్పందాన్ని 40 రోజులకు కుదించారు. దీంతో కేజీబీవీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పది, ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జూన్‌ 9 తర్వాత తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అని ఉపాధ్యాయినులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సమ్మె చేయడం, న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇబ్బందులకు గురి చేసే ఉద్దేశంతోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని