ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.  కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి.

Updated : 03 May 2024 06:25 IST

నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1, మార్కాపురంలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.7, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.6, చిత్తూరు జిల్లా తవణంపల్లె, వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 46.4, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3, తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8, ఎన్టీఆర్‌ జిల్లా చిలకల్లులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, 188 మండలాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 156 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ    సంస్థ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

నేడు తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు (28)

పార్వతీపురం మన్యం 14, విజయనగరం 10, శ్రీకాకుళం 4

వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు (156)

పల్నాడు 26, ప్రకాశం 23, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 13, విజయనగరం 12, అనకాపల్లి 11, ఎన్టీఆర్‌ 11, అల్లూరి సీతారామరాజు 10, శ్రీకాకుళం 10, గుంటూరు 9, కాకినాడ 7, తిరుపతి 7, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, బాపట్ల 3, కృష్ణా 2, అన్నమయ్య 2, పార్వతీపురం మన్యం 1, నంద్యాల 1, అనంతపురం 1.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని