కొత్త వంగడాలతో అధిక దిగుబడి: ఐఐఓఆర్‌

తాము విడుదల చేసిన కొత్త వంగడాలను సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులకు ‘భారత నూనెగింజల పరిశోధనా కేంద్రం’(ఐఐఓఆర్‌) సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. పొద్దుతిరుగుడు పంట సాగుకు కొత్తగా

Published : 24 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: తాము విడుదల చేసిన కొత్త వంగడాలను సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులకు ‘భారత నూనెగింజల పరిశోధనా కేంద్రం’(ఐఐఓఆర్‌) సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. పొద్దుతిరుగుడు పంట సాగుకు కొత్తగా ‘తిలహాన్‌టెక్‌-ఎస్‌యూఎన్‌హెచ్‌-1’ అనే పేరుతో కొత్త వంగడాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్‌, కశ్మీర్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు ఇది అనుకూలమని పేర్కొంది. అలాగే కర్ణాటకకు ఆర్‌ఎస్‌ఎఫ్‌హెచ్‌-700, పంజాబ్‌కు ‘పీఎస్‌హెచ్‌-2080’ అనే వంగడాలను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఆముదం పంటలో ‘ఐసీహెచ్‌-5’ అనే సంకరజాతి రకాన్ని విడుదల చేసింది.కొత్త వంగడాల పరిశోధనలపై ఈ నెల 25 నుంచి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐఐఓఆర్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని