యాదాద్రీశుడి సేవలో సుప్రీం న్యాయమూర్తి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ శనివారం సతీసమేతంగా సందర్శించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి....

Updated : 29 May 2022 05:41 IST

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ శనివారం సతీసమేతంగా సందర్శించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి అశోక్‌కుమార్‌ జైన్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ సృజనతో కలిసి వచ్చిన న్యాయమూర్తి దంపతులకు ఆలయ అధికారులు దేవస్థానం మర్యాదలతో స్వాగతం తెలిపారు. పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు ప్రధానాలయంలో శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలను అందజేశారు. శ్రీస్వామి లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఇన్‌ఛార్జి ఈవో రామకృష్ణారావు అందించారు. తర్వాత ఆలయ నిర్మాణం, శిల్పకళ వైభవాన్ని న్యాయమూర్తి తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని