గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే మోదీ లక్ష్యం: గిరిరాజ్‌సింగ్‌

దేశంలో గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, స్వయం సమృద్ధి లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌

Published : 01 Jul 2022 06:10 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: దేశంలో గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, స్వయం సమృద్ధి లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్డీపీఆర్‌) ఆవరణలోని గ్రామీణ సాంకేతిక పార్కులో తక్కువ ఖర్చుతో నిర్మించిన నమూనా గృహాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రూ.2.34లక్షలతో ఒక పడకగది ఉన్న ఇళ్లు నిర్మించేలా ఎన్‌ఐఆర్డీపీఆర్‌ కృషి చేస్తోందని అన్నారు. ఈ గృహాలను ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో నిర్మించేలా అన్ని రాష్ట్రాలకు సూచిస్తామని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో 3.80కోట్ల ఇళ్లు నిర్మించగా.. మోదీ అధికారంలోకి వచ్చాక 3 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్రకుమార్‌, తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని