అలలపై ‘సౌర’జ్యోతి సంపూర్ణం

ఎన్టీపీసీ నిర్మించిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా

Published : 02 Jul 2022 08:58 IST

న్యూస్‌టుడే, జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ నిర్మించిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సాకారమైంది. రూ.423 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ జలాశయంపై 500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని రూపొందించారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ప్రాజెక్టులో ఇన్వర్టర్‌, ట్రాన్స్‌ఫార్మర్లు అన్నీ నీటిపై తేలియాడుతూ ఉంటాయి. గతంలో 80 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తేగా, శుక్రవారం మిగతా 20 మెగావాట్ల పనులు పూర్తిచేసి వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రకటించారు. 100 మెగావాట్ల విద్యుత్తును గోవాకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పరిపాలన భవనంలో సీజీఎం సునీల్‌కుమార్‌.. ప్రాజెక్టు జీఎం అనిల్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని