వనపర్తి జిల్లాలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ ఆదివారం తెలిపారు. వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి

Published : 04 Jul 2022 06:17 IST

చిన్నంబావి, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ ఆదివారం తెలిపారు. వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి చెందిన పండితారాధ్యుల శిష్యురాలు సత్తెమ్మ అనే మహిళ గ్రామంలో 7వ శతాబ్దంలో ఆలయాన్ని కట్టించారని వివరించారు. ఈ పురాతన శిల్పాలు బాదామి చాళుక్యుల కాలం, ఆనాటి శైలికి చెందినవన్నారు. వీటిలో అపూర్వమైన నగ్నకబంధ, మహాకాలుడు, నంది, పద్మనిధి, శంఖనిధి, గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రామంలో సత్తెమ్మ పేరిట జాతర నిర్వహిస్తారని, భక్తులు ఆయా విగ్రహాలను దర్శించుకోవచ్చని సూచించారు. అరుదైన ఆలయంతో పాటు పురాతన విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరగోపాల్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని