TS HihgCourt: న్యాయవాది హత్య ఘటనపై ప్రభుత్వానికి నోటీసులు

ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా న్యాయవాదుల రక్షణ చట్టానికి సంబంధించిన

Updated : 09 Aug 2022 05:01 IST

బార్‌ కౌన్సిళ్లను ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా న్యాయవాదుల రక్షణ చట్టానికి సంబంధించిన అంశం ఉండటంతో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌, కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. ఇందులో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ములుగు ఎస్పీ, ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది. వరంగల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది మల్లారెడ్డి హత్య సంఘటనను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న విషయం విదితమే. డాక్టర్లకు రక్షణ చట్టం ఉన్నట్లుగానే న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాలన్న హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌ విజ్ఞప్తిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం ఈ కేసులో అమికస్‌ క్యూరీలుగా సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌, జి.విద్యాసాగర్‌లను నియమించింది. న్యాయవాదులకు రక్షణ యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని