మలక్‌పేటలో రూ. 1032 కోట్లతో ఐటీ సౌధం

హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేటలో రూ. 1032 కోట్లతో పది ఎకరాల్లో 16 అంతస్తులతో భారీ ఐటీ సౌధం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది.

Published : 01 Oct 2022 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేటలో రూ. 1032 కోట్లతో పది ఎకరాల్లో 16 అంతస్తులతో భారీ ఐటీ సౌధం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు అక్టోబరు 29 వరకు గడువునిచ్చింది. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు ప్రతిపాదించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాతనగరంలో చేపడుతున్న తొలి ఐటీ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని