ఉపాధ్యాయ బదిలీలు.. రెండో రోజుకు 40,882 దరఖాస్తులు

ఉపాధ్యాయ బదిలీల కోసం రెండో రోజైన ఆదివారం నాటికి మొత్తం 40,882 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా అందాయి. ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి 2,790 వచ్చాయి.

Published : 30 Jan 2023 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీల కోసం రెండో రోజైన ఆదివారం నాటికి మొత్తం 40,882 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా అందాయి. ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి 2,790 వచ్చాయి. దరఖాస్తు గడువు సోమవారం వరకు ఉంది. అయితే సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల సమయం సరిపోదని, గడువును ఫిబ్రవరి 1 వరకు పొడిగించాలని విద్యాశాఖ కార్యదర్శిని టీఎస్‌యూటీఎఫ్‌ కోరింది. మిగిలిన కాలపట్టికను మార్చాల్చిన అవసరం లేదని సూచించింది. ఈ క్రమంలో ఒకటీ లేదా రెండు రోజుల పాటు గడువును పొడిగించే అవకాశం ఉందని సమాచారం.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 70% సిలబస్సే

ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే ప్రాక్టికల్స్‌ ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 100%  సిలబస్‌ ఆధారంగా జరుగుతాయని ఇంటర్‌బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలకు మాత్రం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 100% సిలబస్‌ ఉంటుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు