చేనేతకు కేటాయింపులు రూ.200 కోట్లే

వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగంగా ఉన్న చేనేతకు కేంద్రబడ్జెట్‌ నిరాశను కలిగించింది.

Published : 02 Feb 2023 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగంగా ఉన్న చేనేతకు కేంద్రబడ్జెట్‌ నిరాశను కలిగించింది. నిరుటి మాదిరే ఈసారీ కేవలం రూ.200 కోట్లను కేటాయించింది. చేనేతలో దాదాపు పదికి పైగా పథకాలు, కార్యక్రమాలున్నా కేవలం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాని(ఎన్‌హెచ్‌డీపీ)కి మాత్రమే ఈ నిధులను నిర్దేశించింది. చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సబ్సిడీ, చేనేత సమూహ అభివృద్ధి పథకం, చేనేత భారీ సమూహ పథకం, చేనేత సేవా కేంద్రం ఇతర పథకాలకు నిధుల ఊసే లేదు. దీంతో వాటిని ఎత్తివేసినట్లేనని చేనేత కార్మికవర్గాలు భావిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం కింద రూ.200 కోట్లనే కేంద్రం కేటాయించింది. తర్వాత సవరణ బడ్జెట్‌లో దానిని రూ.156 కోట్లకు తగ్గించింది. వీటిలో రూ.86 కోట్లను ఇప్పటివరకు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు అందించింది. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని