వెబ్‌సైట్‌లోకి వచ్చిన ఊళ్లు

ఇన్నాళ్లూ టీఎస్‌ బి-పాస్‌ వెబ్‌సైట్‌లో లేని మండలాలు, ఊళ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. లేఅవుట్లు, గృహాలు, ఇతర నిర్మాణాలకు పలు అనుమతులు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం టీఎస్‌ బి-పాస్‌ విధానాన్ని తీసుకొచ్చింది.

Updated : 05 Feb 2023 04:21 IST

బి-పాస్‌లో దర్శనమిస్తున్న మండలాలు.. గ్రామాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ టీఎస్‌ బి-పాస్‌ వెబ్‌సైట్‌లో లేని మండలాలు, ఊళ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. లేఅవుట్లు, గృహాలు, ఇతర నిర్మాణాలకు పలు అనుమతులు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం టీఎస్‌ బి-పాస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. నగరపాలక, పురపాలక సంస్థలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలో ఉన్న మండలాల వారు లేఅవుట్లు, భవన నిర్మాణాలకు ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయినా కొన్ని జిల్లాల్లో మండలాలు, గ్రామాలు కనిపించకపోవడంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగారు. గత నెల 22వ తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ సమస్యపై ‘బి-పాస్‌.. ఆ ఊళ్లు బైపాస్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ఉన్నతీకరించాలని ఆదేశించింది. ఆ మేరకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీంతో తాజాగా అన్ని జిల్లాల్లోని మండలాలు, గ్రామాలు ఇప్పుడు వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని