ఆస్ట్రేలియాలో వైభవంగా యాదాద్రీశుల కల్యాణం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ పట్టణంలో శనివారం యాదాద్రీశుల కల్యాణ వైభవంగా జరిగింది. యాదాద్రి క్షేత్ర అర్చకులు పాంచరాత్రాగమ విధానాలతో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

Published : 05 Feb 2023 05:29 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ పట్టణంలో శనివారం యాదాద్రీశుల కల్యాణ వైభవంగా జరిగింది. యాదాద్రి క్షేత్ర అర్చకులు పాంచరాత్రాగమ విధానాలతో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అక్కడ నివసిస్తున్న తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ సభ్యులు అభ్యర్థన మేరకు మెల్‌బోర్న్‌లోని రాఘవేంద్రమఠంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం చేపట్టారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ఈవో గీత మాట్లాడుతూ భారత్‌కు వచ్చినవారు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పేష్కార్‌ రఘు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని