TS Inter Results: నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

గత మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి.

Updated : 09 May 2023 07:35 IST

ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబిత

ఈనాడు, హైదరాబాద్‌: గత మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, www.tsbie.cgg.gov.in, www.results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని