తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం

వివిధ సాహిత్య ప్రక్రియల్లో విశేష సేవలందించిన 23 మందికి 2022 సంవత్సరానికిగాను పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు ప్రదానం చేసింది.

Published : 21 Mar 2024 03:36 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: వివిధ సాహిత్య ప్రక్రియల్లో విశేష సేవలందించిన 23 మందికి 2022 సంవత్సరానికిగాను పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు ప్రదానం చేసింది. బుధవారం విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హాజరై పురస్కారాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం ఆంగ్లభాష మాత్రమే ఉన్నతమైనదిగా పరిగణిస్తూ.. మాతృభాషలను చిన్నచూపు చూస్తుండటం వల్ల మనవైన సాహిత్యం, సంస్కృతి అంతరించిపోయి, జాతి మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, విస్తరణ సేవా విభాగం ఇన్‌ఛార్జి రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 46 మందికి పురస్కారాలు ప్రకటించగా మరో 23 మందికి గురువారం ప్రదానం చేయనున్నారు.

తొలి రోజు పురస్కారాలు అందుకున్న వారు..

శ్రీహరిదాసు(ఆధ్యాత్మిక సాహిత్యం), ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి(ప్రాచీన సాహిత్యం), దాట్ల దేవదానం రాజు(సృజనాత్మక సాహిత్యం), జాలాది రత్న సుధీర్‌(కాల్పనిక సాహిత్యం), డా.జి.వి.రత్నాకర్‌(అనువాద సాహిత్యం), డా.గుర్రం సీతారాములు(అనువాదం), షేక్‌ మహబూబ్‌జాన్‌(బాలసాహిత్యం), డా.పెరుగు రామకృష్ణ(వచన కవిత), తగుళ్ల గోపాల్‌(వచన కవిత-యువకవి), ఎన్వీ రఘువీర్‌ ప్రతాప్‌(తెలుగు గజల్‌), డా.కె.బాలస్వామి, మేడిచర్ల ప్రభాకరరావు(పద్యరచన), చొప్పదండి సుధాకర్‌(కథ), దురికి మోహన్‌రావు(హాస్యరచన), కల్వకోట వెంకట సంతోష్‌ బాబు(జీవిత చరిత్ర), దాస్యం సేనాధిపతి(వివిధ ప్రక్రియలు), ఆకెళ్ల శివప్రసాద్‌(ఉత్తమ నాటక రచయిత), డా.పాటిబండ్ల రామమోహన్‌రావు(జనరంజక విజ్ఞానం), డా.సి.శ్రీనివాసరాజు(పరిశోధన), డా.బుర్రా మధుసూదన్‌రెడ్డి(పత్రికా రచన), ఆచార్య ఎం.గోనా నాయక్‌(భాష), ఎం.భిక్షునాయక్‌(జానపద గాయకుడు), జి.రఘురామశర్మ(అవధానం).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని