బెయిల్‌ పిటిషన్లు సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసుకోండి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తమ బెయిల్‌ పిటిషన్లను సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసుకోవాలని నాంపల్లి కోర్టు సూచించింది.

Published : 16 Apr 2024 03:36 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు నాంపల్లి కోర్టు సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తమ బెయిల్‌ పిటిషన్లను సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసుకోవాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నిందితులు ప్రణీత్‌రావు, తిరుపతన్న తమ బెయిల్‌ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో నలుగురిపై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 70 ఐటీ యాక్ట్‌ కేసు నమోదు చేయడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నందున సెషన్స్‌ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి ఏసీఎంఎం కోర్టు సూచించింది. దీంతో నాంపల్లిలో వేసిన బెయిల్‌ పిటిషన్లను నిందితులు ఉపసంహరించుకున్నారు. మంగళవారం సెషన్స్‌ కోర్టులో వాటిని దాఖలు చేయనున్నారు. మరోవైపు కేసులో ఏ1గా ఉన్న రాధాకిషన్‌రావు రిమాండ్‌ ఏప్రిల్‌ 12న ముగియగా.. మరికొన్ని రోజులకు పొడిగిస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని