Published : 24/02/2023 19:36 IST

ట్యాన్ ఎలా తగ్గుతుంది?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి ట్యాన్‌ సమస్యతో బాధపడుతున్నాను. వేసవిలో మరింత ఎక్కువవుతోంది.. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ట్యాన్‌కి టాటా చెప్పాలంటే నేను చెప్పబోయే ఇంటి చిట్కాని పాటించండి. దీనికోసం ముందుగా తొక్క తీసిన యాపిల్‌ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక కప్పులో తీసుకొని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బార్లీ పిండిని కలపాలి. కలిపిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కొద్ది నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. యాపిల్, బార్లీ పిండి.. వీటికి బదులుగా బియ్యప్పిండి, బంగాళాదుంపలను కూడా ఉపయోగించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని