Published : 20/11/2022 14:17 IST

ఎముకల ఆరోగ్యానికి ఈ ఆహారం!

మహిళలకు ఎదురయ్యే సమస్యల్లో ఆస్టియోపొరోసిస్‌ ఒకటి. ఎముకలు బలహీనపడి, విరిగిపోవడం ఈ సమస్యలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి, అలా జరగకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం వల్లనే సాధ్యమవుతుంది.

⚜ కొవ్వులేని పాలతో చేసిన కప్పు పెరుగు తీసుకోవడం వల్ల 30 శాతం క్యాల్షియం, కొంత శాతం విటమిన్‌ డి శరీరానికి అందుతాయి. కొవ్వు తొలగించిన పాలు తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీలతో పాటు శరీరానికి అవసరమైన క్యాల్షియం కూడా అందుతుంది.

⚜ ఛీజ్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి దీనిని చాలామంది తమ ఆహారంలో భాగం చేసుకోవాలని అనుకుంటారు. కానీ దానివల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, మోతాదు మించకుండా తీసుకోవాలి.

⚜ గుడ్లలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్‌ ‘డి’ మాత్రం కొద్దిగానే ఉంటుంది. అయితే కేవలం తెల్లసొన మాత్రమే కాదు.. పచ్చసొననీ తీసుకోవాల్సి ఉంటుంది.

⚜ పాల పదార్థాలు తినడం ఇష్టం ఉండదా? అయితే పాలకూరను ఎంచుకోండి. కప్పు ఉడికించిన పాలకూరలో రోజులో అవసరమైన క్యాల్షియం 25 శాతం వరకూ అందుతుంది. దాంతో పాటు పీచు, ఇనుము, ‘ఎ’ విటమిన్‌ కూడా శరీరానికి అందుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని