ఎంఫార్మసీ.. పానీపూరీవాలీ

ఎంత గొప్ప కొలువు కోరి వచ్చినా... ఆత్మ సంతృప్తి లేనిదే నేను చెయ్యనని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? కరీంనగర్‌కి చెందిన కొప్పుల పూర్ణిమ కూడా అలాంటి తెగువనే చూపించింది.

Updated : 14 Nov 2023 08:45 IST

ఎంత గొప్ప కొలువు కోరి వచ్చినా... ఆత్మ సంతృప్తి లేనిదే నేను చెయ్యనని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? కరీంనగర్‌కి చెందిన కొప్పుల పూర్ణిమ కూడా అలాంటి తెగువనే చూపించింది. ఎంఫార్మసీ చదివినా.. తనకు నచ్చిన విధంగా హెర్బల్‌ పానీపూరీలను అమ్మేస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది..

న్నత చదువులు చదివినా, ఉద్యోగం చేసినా... నాలుగు రూపాయలు వెనకేసుకోవడానికే కదా! అలాగని ఆత్మసంతృప్తి లేకుండా ఏ పనీ చేయలేం. నా కాళ్లమీద నేను నిలబడగలిగితేనే అది సాధ్యమని నమ్మా. దాంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కరీంనగర్‌లో ‘ఎంఫార్మసీ- పానీపూరీ వాలీ’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించా. దాన్ని చూసిన కొందరు ఇంత చదువూ చదివి పానీపూరీలు అమ్ముతున్నావా అంటూ ఉంటారు. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు... ఎడారిలో కూడా పూలూ పూయించొచ్చనేది నా అభిప్రాయం. అందుకే, అవేవీ మనసుకి తీసుకోలేదు. మాది జగిత్యాల జిల్లాలోని పడకల్‌. చదువయ్యాక కరీంనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేశా. కొన్నాళ్లు మెడికల్‌ షాపూ నిర్వహించా. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. ఆ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే పానీపూరీ వ్యాపారాన్ని వినూత్నంగా నిర్వహించాలనుకున్నా. ఈ ఆలోచనను మా వారికి చెబితే ప్రోత్సహించారు. అలా ముందడుగు వేశా. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ పానీపూరీలతో పాటు పుదీనా, జీలకర్ర, లసూన్‌ (ఎల్లిపాయలు), హింగ్‌(ఇంగువ), కట్టామీఠా, చిల్లీ(తెలంగాణ స్టైల్‌) వంటి హెర్బల్‌ పానీపూరీలెన్నో అందిస్తున్నా. తక్కువ కాలంలోనే నేను తయారుచేస్తున్న పానీపూరీలకు ఆదరణ పెరిగింది. ఆ నోటా ఈ నోటా తెలిసి వీటికోసం ఎక్కడెక్కడినుంచో వినియోగదారులు వస్తుండటం సంతోషంగా ఉంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ఫ్రాంచైజీ పద్ధతిలో పానీపూరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయలనుకుంటున్నా.

- తన్నీరు శ్రీనివాసరావు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్