మన గచ్చకాయలాట... కొరియాలో!

మీకు గిల్లాలాట తెలుసా! పోనీ గచ్చకాయలాట... వేసవి సెలవులు వచ్చాయంటే చాలు... చిన్నప్పుడు స్నేహితులూ, ఇరుగూపొరుగుతో కలిసి మనం ఇంట్లోనే సరదాగా ఆడుకునే ఆట ఇది.

Published : 27 Mar 2024 01:12 IST

మీకు గిల్లాలాట తెలుసా! పోనీ గచ్చకాయలాట... వేసవి సెలవులు వచ్చాయంటే చాలు... చిన్నప్పుడు స్నేహితులూ, ఇరుగూపొరుగుతో కలిసి మనం ఇంట్లోనే సరదాగా ఆడుకునే ఆట ఇది. ఇప్పుడైతే ఫోన్‌, టీవీల్లోనే కాలక్షేపం వెతుక్కుంటున్నాం. కానీ గులక రాళ్లూ, చింత పిక్కలూ, గచ్చకాయలూ గతంలో వీటితోనే తెగ ఆడేవాళ్లం. ఆనందంతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఈ ఆటవల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గుర్తించిన దక్షిణ కొరియా అక్కడి వారికోసం ఏకంగా టోర్నమెంటులే నిర్వహిస్తోందట. ‘గాన్‌గీ’ అని పిలిచే ఈ ఆట అక్కడ సంప్రదాయ క్రీడల్లో ఒకటి.  పిల్లల ఆటగా అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. ఇది చేతికీ, కంటికీ సమన్వయాన్ని మెరుగుపరుస్తుండటమే కాదు, కళ్లకు మంచి వ్యాయామంలానూ ఉంటుందని వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఉత్తర భారతదేశంలో గిట్టె అనీ, దక్షిణ భారత్‌లో పచేట అనీ ప్రసిద్ధి. ఒక రాయి పైకి విసిరి, కింద ఉన్న రాళ్లను చేతిలోకి తీసుకోవడం, అలానే చేయి వెనక్కి తిప్పి రాళ్లన్నింటినీ బ్యాలెన్స్‌ చేయడం లాంటివి పిల్లల్లో ఏకాగ్రత, మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయట. చాలా ఏళ్ల క్రితమే ఇంత మంచి ఆటను పూర్వికులు మనకు పరిచయం చేశారంటేనే అర్థంచేసుకోవచ్చు దీనివల్ల ప్రయోజనాలెన్ని ఉన్నాయో! మరి ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి గచ్చకాయలాట పరిచయం చేద్దామా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్