Updated : 19/02/2021 15:17 IST

తెల్లవెంట్రుకలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా?

నా వయసు 25. రెండు, మూడు తెల్ల వెంట్రుకలు కనిపించగానే తీసేశాను. ఆ తర్వాత చాలా వచ్చాయి. హెన్నా పెడుతుంటే జుట్టు పొడిబారిపోతోంది. తెల్లవెంట్రుకలు నల్లబడతాయా లేకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయా?
వెంట్రుకలు నెరవడానికి ఎన్నో కారణాలుంటాయి. ఎండలో ఎక్కువగా తిరిగి అతినీలలోహిత కిరణాల బారినపడటం, గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలు, సబ్బులు వాడటం, అలాగే పొగతాగడమే కాకుండా.. పీల్చినా జుట్టు నెరుస్తుంది. చాక్లెట్లు, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినేవాళ్లు, కూల్‌డ్రింక్స్‌, సోడాలు తాగేవాళ్లకు వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి. విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, పసుపుపచ్చని పండ్లు తీసుకోవాలి. అలాగే పెరుగు, టొమాటోలు, అరటిపండ్లు, లివర్‌ తినాలి. గుడ్డు, చికెన్‌, మాంసం, తృణధాన్యాలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
ఇంటి చికిత్స: వంద గ్రాముల కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడిచేసి, గోరుగా వెచ్చగా ఉన్పప్పుడే తలకు రాయాలి. అలాగే కప్పు కొబ్బరినూనెలో చెంచా చొప్పున ఉసిరి, మెంతిపొడి వేసి కలిపి వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించాలి. అరకప్పు నువ్వుల నూనెలో రెండు చెంచాల మెంతిపొడి, పావుకప్పు క్యారెట్‌ రసం కలిపి రాసినా మంచిదే. వారానికి రెండు సార్లు గాఢత తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. పోషకాహార లోపంతో తెల్ల వెంట్రుకలు వస్తే ఫర్వాలేదుగానీ వంశపారంపర్యంగా వస్తే పూర్తిగా తగ్గవు. పోషకాహారం, వ్యాయామాలతో వెంట్రుకలు నెరవడాన్ని వాయిదా వేయొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్