Italy: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా అతివాద నేత జార్జియా మెలోని..!

ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవిని చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని(45) ఇటీవల జరిగిన ఎన్నికల్లో

Updated : 26 Sep 2022 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవి చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని(45) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37శాతం ఓట్లు సాధించారు. ఆమె నేతృత్వంలోని కూటమి 43శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది.  మెలోని పూర్తిగా అతివాద నేత. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే. వివాదాస్పదమైన ‘గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు.

* ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్‌ను విమర్శించేందుకు మెలోని పెద్దగా ఆసక్తి చూపలేదు. నాటోకు, ఉక్రెయిన్‌కు ఆమె నుంచి అనుకొన్న స్థాయిలో మద్దతు లభించలేదు.

* గత ఎన్నికల్లో మెలోని పార్టీకి కేవలం 4శాతం మాత్రమే ఓట్లు లభించాయి. కానీ, మారియో డ్రాఘీ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి నిరాకరించారు. దీంతో ఆమె ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలిచారు. 

* గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో మెలోని జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి వారి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మెలోని తల్లి వద్దే పెరిగింది. యుక్త వయసులో ఆమె నియో ఫాసిస్టు సంస్థ యూత్‌ విభాగంలో చేరారు. కాకపోతే తాను ఫాసిస్టుని కాదని ఆమె చెబుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు