Finland: పార్టీ వీడియో వైరల్.. ఆ ప్రధానికి డ్రగ్స్ పరీక్ష ..!
మిత్రులతో కలిసి పార్టీ చేసుకొని ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్(Sanna Marin) వివాదంలో చిక్కుకున్నారు.
హెల్సింకి: మిత్రులతో కలిసి పార్టీ చేసుకొన్నందుకు గానూ ఫిన్లాండ్(Finland) ప్రధాని సనా మారిన్(Sanna Marin) వివాదంలో చిక్కుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించి ఉండొచ్చని, ప్రధాని వాటిని తీసుకొని ఉండొచ్చని విపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో మారిన్ డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు.
‘అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు నేను డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నాను. ఒక వారంలో పరీక్షా ఫలితాలు వస్తాయి. అవి వచ్చిన వెంటనే వాటిని మీడియాతో పంచుకుంటాను’ అని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ విమర్శలను ఇదివరకే మారిన్ తోసిపుచ్చి, విచారం వ్యక్తం చేశారు. ‘ఓ సాయంత్రం వేళ.. మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్ తప్ప ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. మేం ఏ తప్పూ చేయలేదు’ అంటూ ఆమె వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్