అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో చిన్నసైజు విమానం ప్రమాదానికి గురైన ఘటన అర శతాబ్దం కిందట వచ్చిన ‘పాపం పసివాడు’ చిత్రంలోని హృదయ విదారక దృశ్యాలను తలపిస్తోంది.
అంతుచిక్కని నలుగురు చిన్నారుల ఆచూకీ
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో చిన్నసైజు విమానం ప్రమాదానికి గురైన ఘటన అర శతాబ్దం కిందట వచ్చిన ‘పాపం పసివాడు’ చిత్రంలోని హృదయ విదారక దృశ్యాలను తలపిస్తోంది. నెలకిందట.. మే 1న జరిగిన ఈ విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల్లో తప్పిపోయారు. వారి తల్లి, విమాన పైలట్, గైడ్ల మృతదేహాలు శకలాల్లో లభ్యం కాగా.. నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఇందులో 11 నెలల పసిబిడ్డ సహా 13, 9, 4 ఏళ్ల వయసువారు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరి కోసం భద్రతాదళాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో, నిత్యం క్రూరమృగాలు సంచరించే పరిసరాల్లో పిల్లల ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 100 మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ హోప్’ పేరిట ఈ చర్యల్లో పాల్గొంటున్నాయి. 15 రోజుల క్రితం ఆ చిన్నారులు క్షేమంగానే ఉన్నారనే విధంగా చిన్నగుడారం, జుట్టుకు కట్టే రిబ్బను, పాలసీసా, సగం తిన్న పండ్లు కనిపించాయి. పిల్లలు సురక్షితంగా ఉన్నారని కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమైనా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. చిన్నారుల ఆచూకీ ఇంకా లభించలేదు. అమెజాన్ అటవీప్రాంత పరిధిలోని ఆరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1 తెల్లవారుజామున మొత్తం ఏడుగురితో ఈ చిన్నపాటి విమానం బయలుదేరింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది నేల కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. కొద్దిసేపటికే రాడార్ల పరిధి నుంచి ఆ విమానం వేరయింది. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు విమాన శకలాలను, ముగ్గురి మృతదేహాలను గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/09/2023)
-
Koppula Harishwar Reddy: పరిగి ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఉపసభాపతి కన్నుమూత
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు