సునీత అంతరిక్ష యాత్ర వాయిదా

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది.

Published : 08 May 2024 05:57 IST

కేప్‌ కెనావెరాల్‌: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్‌ రాకెట్‌ ఎగువ దశలోని ఆక్సిజన్‌ వాల్వ్‌లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక నింగిలోకి పయనంకావాల్సింది. దీన్ని అటాస్‌ రాకెట్‌.. రోదసిలోకి మోసుకెళ్లాల్సి ఉంది.  యాత్ర కోసం వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లు వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్‌లోని ఆక్సిజన్‌ ప్రెజర్‌-రిలీఫ్‌ వాల్వ్‌లో లోపం తలెత్తినట్లు గమనించి కౌంట్‌డౌన్‌ను నిలిపేసి ప్రయోగాన్ని వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని