Independence day: స్వాతంత్య్ర వేడుకలకు అమెరికా గాయని మిల్బెన్‌

ఓం జయ జగదీశ హరే, జనగణమన గీతాలను ఆలపించి భారత్‌, అమెరికాల మధ్య స్నేహవారధిగా నిలిచిన నల్లజాతి అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి

Updated : 07 Aug 2022 05:51 IST

వాషింగ్టన్‌: ఓం జయ జగదీశ హరే, జనగణమన గీతాలను ఆలపించి భారత్‌, అమెరికాల మధ్య స్నేహవారధిగా నిలిచిన నల్లజాతి అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి దిల్లీ వస్తున్నారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఆహ్వానంపై ఆమె అమెరికా అధికార ప్రతినిధిగా వస్తున్నారు. ఆగస్టు 10న ఇండియాస్పోరా గ్లోబల్‌ ఫోరమ్‌లో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. చెన్నైకు చెందిన పియానో కళాకారుడు లిడియన్‌తో కలసి ప్రదర్శన ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని