Global warming: ఈ శతాబ్దం చివరికి రాత్రి ఉష్ణోగ్రతలూ 40 డిగ్రీలకు!

భూమిపై వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరికి అధిక వేడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా మరణాల రేటు 6 రెట్లు పెరగవచ్చని పేర్కొంది. ఈ వివరాలు ది లాన్సెట్‌ ప్లానెటరీ

Updated : 10 Aug 2022 07:45 IST

బీజింగ్‌: భూమిపై వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరికి అధిక వేడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా మరణాల రేటు 6 రెట్లు పెరగవచ్చని పేర్కొంది. ఈ వివరాలు ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. రాత్రి సమయాల్లో వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ నిద్రకు భంగం వాటిల్లుతోందని అమెరికాలోని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. తక్కువ నిద్ర ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి ఆరోగ్యంపై పలు రకాల దుష్ప్రభావాలు పడతాయని, మరణాల రేటు పెరుగుతుందని వెల్లడించారు. తూర్పు ఆసియా దేశాలైన చైనా, దక్షిణకొరియా, జపాన్‌లోని 28 నగరాల్లో సరాసరి రాత్రి ఉష్ణోగ్రతలు 2090 నాటికి రెట్టింపు అవుతాయని, 20.4 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 39.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరతాయని అధ్యయనంలో గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని