జన్యువులపై చిన్ననాటి అనుభవాల ముద్ర

చిన్నతనంలో ఎదురైన అనుభవాలు మన జన్యువులపై చెరగని ముద్ర వేస్తాయని లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

Published : 03 Dec 2022 05:11 IST

లండన్‌: చిన్నతనంలో ఎదురైన అనుభవాలు మన జన్యువులపై చెరగని ముద్ర వేస్తాయని లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆయుర్దాయంపై కూడా అవి ప్రభావం చూపుతాయని తేలింది. జన్యు వ్యక్తీకరణకు సంబంధించిన ‘జ్ఞాపకాలు’ జీవితాంతం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచే దిశగా ఈ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని వివరించారు. ఒక జన్యువులో నిక్షిప్తమైన సమాచారం తొలుత మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏగా, ఆ తర్వాత ప్రొటీన్‌గా మారడాన్ని జన్యు వ్యక్తీకరణగా పేర్కొంటారు. ‘‘తల్లి గర్భంలో ఉన్నప్పుడు, చిన్నతనం, యవ్వనంలో ఎదుర్కొన్న పరిస్థితులు.. వార్ధక్యంలో ఒక వ్యక్తి ఆరోగ్యంపై పాక్షికంగా ప్రభావం చూపుతాయి. ఇందుకు దారితీసే మార్గాన్ని మేం గుర్తించాం. చిన్నతనంలో చోటుచేసుకునే జన్యు వ్యక్తీకరణ మార్పులకు సంబంధించిన జ్ఞాపకాలు శాశ్వతంగా నిక్షిప్తమవుతాయి. దాని ప్రభావం భవిష్యత్‌లో కొనసాగుతుంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన నజీఫ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని