BRICS Summit: డిజిటల్‌ లావాదేవీలు భారత్‌లోనే అధికం.. ‘బ్రిక్స్‌’ సదస్సులో మోదీ..

BRICS Summit: ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతే అత్యధికంగా డిజిటల్‌ లావాదేవీలు చేస్తోందని ‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రధాని మోదీ ‘UPI’ సేవలను కొనియాడారు.

Published : 23 Aug 2023 13:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణఫ్రికా (South Africa)లో నిర్వహించిన ‘బ్రిక్స్‌’ (BRICS) సదస్సులో దేశ ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడారు. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే దేశ ప్రజల సంకల్పం అని అన్నారు. పదో వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ను అభినందించారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించంటంలో బ్రిక్స్‌ బిజినెస్ కౌన్సిల్‌ పాత్ర కీలకమైనదని తెలిపారు. అనంతరం యూపీఐ (UPI) సేవల గురించి కొనియాడారు.

ఏప్రిల్‌- ఆగస్టులో నియామకాల ‘పండగ’

‘‘ప్రస్తుతం ఈ ‘సింగిల్‌ క్లిక్‌’ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్‌ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గు ముఖం పట్టింది. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ నిర్వహించే వారి వరకూ అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నింటిల్లో అత్యధికంగా డిజిటల్‌ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్‌. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), సింగపుర్‌ (Singapore), ఫ్రాన్స్ (France) దేశాలు కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నాయి’’ అంటూ యూపీఐ విస్తరణ గురించి తెలిపారు. బ్రిక్స్‌లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని