Plane Crash: జింబాబ్వేలో విమాన ప్రమాదం.. భారతీయ వ్యాపారవేత్త సహా ఆరుగురి మృతి

జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి వ్యాపావేత్త సహా ఆరుగురు మృతి చెందారు. సాంకేతిక లోపంతో విమానం కూలిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Updated : 02 Oct 2023 15:10 IST

జొహెన్స్‌బర్గ్‌: జింబాబ్వే(Zimbabwe)లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త, ఆయన కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. భారత్‌కు చెందిన హర్‌పాల్‌ రంధావా (Harpal Randhawa) జింబాబ్వేలో రియోజిమ్‌ (RioZim) పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ బంగారం, బొగ్గును ఉత్పత్తి చేయడంతోపాటు నికెల్‌, రాగిను శుద్ధి చేస్తుంది. శుక్రవారం హర్‌పాల్‌, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి జింబాబ్వేలోని హరారే నుంచి మురోవాలోని మైనింగ్‌ ప్రాంతానికి కంపెనీకి చెందిన సెస్నా 206 విమానంలో బయలుదేరారు. విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు, స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలోని వారంతా మృతి చెందినట్లు వెల్లడించారు. 

‘డిసీజ్‌ ఎక్స్‌’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!

విమాన ప్రమాద వార్తలను రియోజిమ్‌ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి పేర్లను మాత్రం జింబాబ్వే పోలీసులు వెల్లడించలేదు. హర్‌పాల్‌ స్నేహితుడు, నిర్మాత హోప్‌వెల్‌ చినోనో ఆయన మృతిని ధ్రువీకరించాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని రియోజిమ్‌ ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని