Indian woman: నడిసంద్రంలో నౌకనుంచి అదృశ్యమైన భారతీయ మహిళ..!

భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ(Indian woman) నడిసంద్రంలో కనిపించకుండా పోయారు. ఆమె అదృశ్యం వెనకగల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

Updated : 01 Aug 2023 16:47 IST

(ప్రతీకాత్మక చిత్రం)

మాలే: నడి సముద్రంలో క్రూజ్‌షిప్‌(cruise ship) నుంచి ఓ భారతీయ మహిళ(Indian woman) అదృశ్యమయ్యారు. మలేషియా(Malaysia)లోని పెనాంగ్ ద్వీప రాష్ట్రం నుంచి సింగపూర్ జలసంధి(Strait of Singapore)లో నౌక ప్రయాణిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె అదృశ్యమైన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. 

రీటా సహానీ, జాకేశ్‌ సహానీ భార్యభర్తలు. నాలుగు రోజుల విహార యాత్రలో భాగంగా క్రూజ్‌షిప్‌ పెనాంగ్‌ నుంచి సింగపూర్‌కు వస్తుండగా.. 70 ఏళ్ల జాకేశ్ నిద్రలేచే సమయానికి రీటా గదిలో కనిపించలేదు. ఆ నౌక(cruise ship)లో ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆయన నౌకలోని సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వారు తమ ఓవర్‌బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశారు. నౌక సింగపూర్ జలసంధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఏదో సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. రీటా వయస్సు 64 సంవత్సరాలు.

ఆంగ్‌ సాన్‌ సూకీకి క్షమాభిక్ష.. శిక్ష తగ్గించిన సైనిక ప్రభుత్వం

ఈ ఘటనపై రీటా కుమారుడు అపూర్వ్‌ సహానీ మాట్లాడుతూ .. తన తల్లి గురించి తమకు ఎలాంటి జాడ తెలియలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ను మరోసారి సమీక్షించాలని తాము అభ్యర్థించినట్లు వెల్లడించారు. నౌకపై నుంచి జలసంధిలోకి పడిపోయింది తన తల్లే అని ఇంతవరకు ఎలాంటి ధ్రువీకరణ రాలేదన్నారు. నౌకలోని సిబ్బంది ఆమె దూకి ఉండొచ్చని భావిస్తుండగా.. ఆమె అందులోనే ఎక్కడో దగ్గర చిక్కుకొని ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశతో ఉన్నారు. ఆమె విహారయాత్రలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చోటుచేసుకోవడంతో తమకేమీ అర్థం కావడం లేదన్నారు.  ఆమె భర్త జాకేశ్‌ సహానీ ప్రస్తుతం పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. సింగపూర్ జలసంధి.. మలక్కా జలసంధి, దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు