Zelensky : ప్రిగోజిన్‌ మృతి వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హస్తం: జెలెన్‌ స్కీ

వాగ్నర్‌ బాస్‌ ప్రిగోజిన్‌ను (Yevgeny Prigozhin) రష్యా (Russia) అధ్యక్షుడే చంపించారని ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌ స్కీ (Zelensky) సంచలన ఆరోపణలు చేశారు.

Published : 08 Sep 2023 21:12 IST

కీవ్ : వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) మరణం వెనుక రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) హస్తం ఉందని ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌ స్కీ (Zelensky) ఆరోపించారు. కిరాయి సైన్యంగా పేర్కొందిన వాగ్నర్‌ గ్రూప్‌నకు ప్రిగోజిన్‌ నాయకత్వం వహించాడు. కొద్ది నెలల క్రితం రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి ప్రిగోజిన్‌ సంచలనం సృష్టించాడు. ఆ తరువాత బెలారస్‌లో తలదాచుకున్నాడు. పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో వ్యాఖ్యానించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించాడు. అతడికి రక్షణగా ఉన్న బాడీగార్డులు, పైలట్లు సహా ఈ ప్రమాదంలో 10మంది మరణించారు. 

సీఈఓకు నిరసన సెగ.. మహిళలు దూసుకొచ్చి కేకు పూసి..!

కీవ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. పుతిన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్‌ చనిపోవడానికి పుతిన్‌ కారణమన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. ‘అతడు ప్రిగోజిన్‌ను చంపించిన మాట వాస్తవం. అది అతడి హేతుబద్ధత.. ఎంత బలహీనంగా ఉన్నాడనే వాస్తవాన్ని తెలియజేస్తోంది’ అని జెలెన్‌ స్కీ వ్యాఖ్యానించారు. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశోధిస్తామని క్రెమ్లిన్‌ ఇదివరకే తెలిపింది. ప్రిగోజిన్‌ విమాన ప్రమాద ఘటన ఉద్దేశపూర్వంగా జరిగిందా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తామని పేర్కొంది. ప్రిగోజిన్‌ మరణం వెనుక పుతిన్‌ ఉన్నారనే ఆరోపణలను తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు