
తాజా వార్తలు
TS: ఈడబ్ల్యూఎస్ కోటాపై కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు అమలు చేసే రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం అమలు చేస్తున్నామని.. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రిజర్వేషన్లు 60 శాతానికి పెరగనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఈ అంశంపై విధివిధానాలు రూపొందించాలని.. రెండు మూడు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహణకు సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఈడబ్ల్యూఎస్ అమలుపై మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో ఎంతో మంది నిరుద్యోగులు ఈ రిజర్వేషన్లను వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
ఇవీ చదవండి..
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో?లేదో?: భట్టి