TS news: తెలంగాణలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతి

తాజా వార్తలు

Published : 24/08/2021 20:52 IST

TS news: తెలంగాణలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతి

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు, హర్‌ ప్రీత్‌ సింగ్‌, అర్వింద్‌ కుమార్‌లకు ఎపెక్స్‌ స్కేల్‌కు పదోన్నతి క్పలించారు. దీంతో వారికి  ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా దక్కింది. పదోన్నతి తర్వాత కూడా ముగ్గురు అధికారులు ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ఈమేరకు ఆ పోస్టులను రీడిజిగ్నేట్‌ చేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధికేంద్రం సంచాలకులుగా హర్‌ ప్రీత్‌సింగ్‌ కొనసాగనున్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని