Ts News: మల్లన్నసాగర్‌ను చూసి పరవశించిన సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 27/08/2021 17:55 IST

Ts News: మల్లన్నసాగర్‌ను చూసి పరవశించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌‌: మల్లన్నసాగర్‌ జలాశయాన్ని విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. కరీంనగర్‌ పర్యటన నుంచి హైదరాబాద్‌ వస్తున్న సందర్భంలో హెలికాప్టర్‌ నుంచి మల్లన్నసాగర్‌ను సీఎం పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌. ఇది 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమైంది. జలాశయం నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని జలాశయంలోకి పంపుతున్నారు. ఆ దృశ్యాన్ని విహంగవీక్షణం ద్వారా చూసి సీఎం ఆనందం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని