24 గంటల్లో భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

24 గంటల్లో భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య బుధవారం భారీగా పెరిగింది. మరణాల్లోనూ పెరుగుదల నమోదైంది. క్రితం రోజు 30 వేలకు దిగువన రోజువారీ కేసులు నమోదు కాగా బుధవారం ఏకంగా 43 వేలు దాటాయి. గత 24 గంటల్లో 43,654 కొత్త కేసులు బయటపడగా.. 640 మంది కొవిడ్‌తో మృతిచెందారు. రోజువారీ కేసుల్లో సగానికి పైగా కేరళలోనే (22,129) నమోదయ్యాయి.

అవగాహన కల్పించండి : ప్రధాని

కరోనా టీకాలపై అవగాహన కల్పించి, అందరూ వేసుకునేటట్టు చూడాలని ప్రధాని మోదీ మత పెద్దలను కోరారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ మతాలు, సామాజిక వర్గాల ప్రముఖులతో మాట్లాడారు.

21% పెరిగిన మరణాలు : డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా గత వారం కొవిడ్‌ మరణాలు 21 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మహమ్మారి కారణంగా 69 వేల మరణాలు నమోదయ్యాయని,  ఇందులో అత్యధికంగా ఆగ్నేయాసియా, అమెరికా దేశాల నుంచే ఉన్నట్లు తెలిపింది. అత్యధిక సంఖ్యలో కేసులు అమెరికా, బ్రెజిల్‌, ఇండొనేసియా, బ్రిటన్‌, భారత్‌లలోనే నమోదైనట్లు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని