యువతులే టాప్‌

ప్రధానాంశాలు

యువతులే టాప్‌

పీజీసెట్‌ దరఖాస్తుల్లో..అర్హత సాధనలో వారిదే హవా
మొత్తంగా అర్హులు 92.16% మంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏడు వర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష (సీపీజీఈటీ)-2021 ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయా వర్సిటీల పరిధిలో 53 కోర్సులకు సంబంధించి 68,836 మంది పరీక్షలకు హాజరయ్యారు. 63,748 మంది(92.16 శాతం) అర్హత సాధించారు. పలు కోర్సుల్లో తొలి మూడు ర్యాంకులను యువతులే సొంతం చేసుకున్నారు. గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్‌, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, సెట్‌ కన్వీనర్‌ పాండురంగ ఫలితాలను విడుదల చేశారు. పీజీ కోర్సులకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ఉంటుందని, ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌ వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి మొదలవుతుందని, దోస్త్‌ తరహాలో ప్రవేశ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. పీజీ కోర్సుల్లో 41,174 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఈడబ్ల్యూఎస్‌ అమలు, కొత్త కళాశాలల మంజూరుతో సీట్లు పెరిగే అవకాశముందని, ఓయూలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజులు పెరగనున్నాయని వెల్లడించారు.

* పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి చూపే యువతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విద్యాసంవత్సరానికి యువకుల కన్నా, యువతులు దాదాపు రెట్టింపు స్థాయిలో అర్హత సాధించారు. ముస్లింలలో ప్రవేశ పరీక్షల కోసం 1041 మంది యువకులు దరఖాస్తు చేసుకోగా, యువతులు (4,985) నాలుగురెట్లు అధికంగా ఉన్నారు. పీజీ కోర్సులకు అర్హత సాధించిన వారిలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఓయూ వీసీ రవీందర్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని