ఎమ్మెల్యే వీరయ్యపై కేసుల కొట్టివేత

ప్రధానాంశాలు

ఎమ్మెల్యే వీరయ్యపై కేసుల కొట్టివేత

ఓటర్లకు డబ్బులు పంచడంతో పాటు ప్రజా జీవనానికి విఘాతం కలిగించారనే కేసుల్లో పీసీసీ ఉపాధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న 12 కేసులను నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది. ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో వీరయ్యతో పాటు మరికొందరిపై భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శనివారం విచారణకు వీరయ్య హాజరయ్యారు. నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి వరప్రసాద్‌ తీర్పును వెలువరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని